క్లినిక్ కంపౌండర్…

 

detective stories in telugu
detective stories in telugu

ఒక మారుమూల గ్రామంలో సంతోష్ అనే ఒక వ్యక్తి, అదే గ్రామంలో ఉన్న చిన్న క్లినిక్ లో కంపౌండర్ గా పని చేస్తున్నాడు , అతని తల్లితండ్రులు రైస్ మిల్లులో పని చేస్తుండేవారు, వీళ్ళకి ఒక్కడే సంతానం. సంతోష్ Pharmacy చదవడం వాళ్ళ అతనికి మెడిసిన్ మీద కొంచము అవగాహనా ఉండటంతో క్లినిక్ లో కంపౌండర్ గా చేరాడు, క్లినిక్ లో పని అంత అయిపోయాక సరదాగా స్నేహితులతో జల్సా చేస్తుండేవాడు, ఒక రోజున సంతోష్ వాళ్ళ స్నేహితుడు పుట్టిన రోజు ఉంటే వెళ్ళాడు, పుట్టిన రోజు దావత్ మామిడి తోట లో పెట్టుకున్నారు, మామిడి తోట ఊరుకి దూరంగా ఉంది, పార్టీ లో ఫుల్ ఎంజాయ్ చేసారు, పీకలదాకా తాగినారు,తిన్నారు. దావతులో పడి సమయం చుసుకోలేదు, అర్ధరాత్రికి పైగా అయింది ఇక ఎవరి ఇంటికి వాళ్ళు తిరుగు ప్రయాణం చేసారు.

సంతోష్ వాళ్ళ  ఇంటికి వెళ్లాలంటే మధ్యలో ఒక శ్మశానవాటిక దాటుకొని వెళ్ళాలి. సంతోష్ శ్మశానాల గడ్డ దాటుకుంటూ చాలా భయపడుకుంటూ అతి కష్టం మీద ఇంటికి వచ్చేసాడు. ప్రతిరోజు క్లినిక్ కి వెళ్లి చిన్న చిన్న పనులు, ఇంజెక్షన్స్, డాక్టర్ కి సహాయం చేస్తుండేవాడు. సంతోష్ జీతం తక్కువే, పైగా తన ఖర్చులకి  తల్లితండ్రులు సంపాదించినా డబ్బులు కూడా తీసుకునేవాడు. ఇలా సాదాసీదాగా సాగిపోతున్న తన జీవితంపై అసంతృప్తిగా ఉండేవాడు.

నల్ల త్రాచు:

ఒక రోజు క్లినిక్ కి  పాము కాటుకి గురైన ఒక మహిళా కేసు వచ్చింది, విషం చాలా ఎక్కేసింది. ఆమె పోలంపనులకి వెళ్తే అక్కడ బయంకరమైన నల్ల త్రాచుపాము కాటు వేసిందిని  క్లినిక్ తీసుకోని వచ్చినవాళ్లు చెప్పారు.  డాక్టర్ మరియు కంపౌండర్ అయినా సంతోష్ సమయం వృధా చేయాకుండా పాము కాటుకి గురైన మహిళకి ప్రధమ చికిత్స అందచేస్తున్నరు, కానీ మహిళా ప్రాణం మరింత విషముగా మరడాంతో పట్నం కి తీసుకొనివెళ్ళాలి అని చెప్పారు.

పాము కాటు భారిన పడ్డ మహిళా కుటుంబ సభ్యులతో పాటు డాక్టర్, కంపౌండర్ ప్రభుత్వ ఆసుపత్రి కి వచ్చారు. సాయంత్రం 5 గంటలు అవ్వడంతో ఆసుపత్రిలో డాక్టర్స్ ఎవరు లేరు, అక్కడ ఉన్న ఆసుపత్రి సిబ్బంది ఫోన్ చేయడంతో పెద్ద డాక్టర్ వచ్చి ఆ మహిళకి చికిత్స మొదలుపెట్టారు. రాత్రి అవ్వడంతో మహిళని తీసుకోని వచ్చిన డాక్టర్ ఇంటికి వెళ్తూ కంపౌండర్ ని ఆసుపత్రిలోనే ఉండమని చెప్పి వెళ్ళాడు, కంపౌండర్ కూడా సరేనని అన్నాడు.

పాము కాటుకి గురి అయినా మహిళ చికిత్స పూర్తయింది కానీ 24 గంటలు అవుతేకాని  మేము ఏమి చెప్పలేము అని పెద్ద డాక్టర్స్ చెప్పారు. మరుసటి రోజు మహిళా ప్రాణాపాయస్థితికి వచ్చింది, డాక్టర్స్ తమ వంతు కృషి చేస్తున్నారు కానీ కొద్ది సమయం అయ్యాక మహిళా చనిపోయింది, ఆమె కుటుంబ సభ్యులు శోక సంద్రంలో ఉన్నారు. కంపౌండర్ చనిపోయిన మహిళా శవం ని  ఊరుకి తీసుకోని వచ్చారు.

ఊరు ప్రజలు మహిళా అంతక్రియలకి అంత సిద్ధం చేసారు, ఆమెని తీసుకెళ్లి పూడ్చిపెట్టారు. మరుసటి రోజు యధావిధిగా తమ పనులు చేసుకుంటూ వెళ్లిపోతున్నారు, 11వ రోజున మహిళా కుటుంబ సభ్యులు ఆమెని పూడ్చి పెట్టిన స్థలం దగ్గరకి వెళ్లి పూలు, పుష్పగుచ్ఛాలు పెడుదాము అనుకున్నారు, అక్కడికి వెళ్లి చూడగా వాళ్ళు అంత కంగు తిన్నారు.

ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఉరి పెద్దమనుషులకి,పోలీస్ వాళ్ళకి చెప్పారు. పోలీస్ వాళ్ళు వచ్చి ఏమైంది అని ఆరాతీయగా ” పూడ్చిపెట్టిన మహిళా శవం కనిపించడం లేదు, పూడ్చిపెట్టిన గోతిని తొవ్వి శవాన్ని మాయం చేసారు అని ఊరు పెద్దమనుషులు చెప్పారు.

detective stories in telugu
detective stories in telugu

SI మనోహర్ స్మశానవాటికకి వచ్చి అంత పర్యవేక్షితున్నాడు. చనిపోయిన మహిళా తాలూకా వాళ్ళని విచారణ చేస్తున్నాడు. కొద్ది రోజులు గడిచాయి, SI కి ఎన్నికలు బందోబస్తు ఉండటంవల్ల ఇ కేసుని అంత పట్టించుకోలేదు.

లా కొద్ది రోజుల గడిచాయి, అదే గ్రామంలోని ఒక వృద్దుడు చనిపోయాడు, అతని పూడ్చి పెట్టారు, వృద్దుడి శవాన్ని కూడా మాయం చేస్థారుమోని ఉరి గ్రామా ప్రజలు కొందరు ఎవరికి తెలవకుండా కాపలా కాచారు, కాని ఎటువంటి సమస్య లేదు అంత సాధారణంగా ఉండిపోవడంతో గ్రామా ప్రజలు ఊపిరి పిలుచుకున్నారు.

ఒక రోజు కంపౌండర్ క్లినిక్ కి వెళ్ళాడు, అతని దగ్గర ఉన్న కొత్త మొబైల్, మేడలో బంగారపు చైన్ చూసి డాక్టర్ షాక్ అయ్యాడు, ఇవి అన్ని ఎక్కడివి అని అడుగుతే నేను కూడబెట్టుకున్న డబ్బులతో కొనుకున్నాను అని కంపౌండర్ చెప్పాడు. డాక్టరుకీ అసలు  నమ్మబుద్దికావడం లేదు, వీడికి ఇన్ని పైసలు ఎక్కడనుండి వచ్చాయి అని ఆలోచనలో పడ్డాడు, కంపౌండర్ స్నేహితులు కూడా తన ప్రవర్తన చూసి ఆశ్చర్యపోతారు.

వర్షాకాలం కావడంతో క్లినిక్ కి రోగులు సంఖ్య క్రమముగా పెరుగుతూనే ఉన్నాయి. ఒక రోజు క్లినిక్ కి ఒక సీరియస్ కేసు రావడంతో,ఆ రోగిని పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్లాలి అని డాక్టర్  అనుకుంటాడు. రోగుల సంఖ్య ఎక్కువ ఉండటంతో క్లినిక్ ని చూసుకోమని కంపౌండర్ కి చెప్పి వెళ్తుంటే, నేను కూడా పెద్ద హాస్పిటల్ కి వస్తానని డాక్టర్ తో వాదిస్తాడు కానీ డాక్టర్ మాత్రం కంపౌండర్ కి నచ్చ చెప్పి వెళ్తాడు.

రాత్రి సమయం 8 గంటలు అవ్వడంతో కంపౌండర్ క్లినిక్ ని మూసివేసి తాళం వేస్తున్న సమయంలో ఒక ముసలవ్వ తన మనవరాలిని తీసుకోని హడావుడిగా వచ్చింది. కంపౌండర్ ఏమైంది అని అడుగుతే, నా మనవరాలుకి మూర్ఛవ్యాధి ఉందయ్యా, కొద్ది సేపటి క్రితమే మార్చవ్యాధికి గురయింది, జరా చుడయ్యా అని ముసలి అవ్వ  కన్నీళ్లు పెట్టుకుంటూ చెప్పింది.

తనకి తెలిసిన వైద్యసాయంతో కంపౌండర్  చికిత్స అందచేస్తాడు. ఏవో ఇంజెక్షన్లు వేసి తగ్గిపోతాదిలే అవ్వ ఇంటికి తీసుకెళ్లండి అని చేప్తాడు. ముసలి అవ్వ తన మనువరాలిని తీసుకోని ఇంటికి వెళ్తారు.

మరుసటి రోజు డాక్టర్,కంపౌండర్ వచ్చి క్లినిక్ తెరుస్తారు, యధావిధిగా రోగులని పరీక్షించి, మందులు ఇచ్చి పంపిస్తున్నారు. ఉన్నట్టుండి   బయటనుండి  ముసలి అవ్వ పెద్ద పెద్ద ఏడుపులు వినిపించడంతో బయటకి  వెళ్లి చూడగా ముసలి అవ్వ మనువరాలుని తీసుకోని వచ్చింది, డాక్టర్ వెళ్లి పరీక్షించగా ఆమె చనిపోయిందని చెప్పాడు.

ముసలి అవ్వకి ఎవరు లేరు, ఉన్న ఒక మనువరాలి ఆరోగ్యము క్షిణించి చనిపోయింది, మనువరాలి తల్లితండ్రులు ఆమె చిన్నప్పుడే చనిపోతే ముసలి అవ్వ పెంచి పోషించినది. చిన్న వయసులోనే మూర్ఛవ్యాధితో చనిపోయిందిని, ప్రేమగా చుసుకున్న తన మనవరాలు ఇక తిరిగిరాదు అని తెలిసి శోకసంద్రములోకి వెళ్ళిపోయింది

detective stories in telugu
detective stories in telugu

 

మాయమైపోతున్న శవాలు:

ముసలి అవ్వ ఇరుగుపొరుగోళ్ళు తన మనవరాలి అంతక్రియలు పూర్తి చేస్తారు, 2  రోజులు గడిచాక ఆ ఊరు వాళ్లంతా స్మశానవాటికకి హడావుడిగా వెళ్తున్నారు, అక్కడికి వెళ్లి చూస్తే ముసలి అవ్వ మనువరాలి శవం కనిపించడం లేదు.

ఇలా శవాలు మాయమవుతుంటే ఊళ్ళో ఉన్న జనాలకి నిద్ర పట్టటడం లేదు,ఎవరు చేస్తున్నారు, పూడ్చి పెట్టిన శవాలు ఏమైపోతున్నాయిని ప్రజలు అందరూ ఆందళోనకి గురిఅవుతున్నారు. ఆ ఊరి సర్పంచ్, ఊళ్లోని కొందరు ప్రజలు వెళ్లి జిల్లా కలెక్టర్ కి పిర్యాదు చేస్తారు, కలెక్టర్ ఆలస్యం చేయకుండా ఇంతకముందు  విచారణ చేసిన SI మనోహర్ ని పిలిచి, అసలు ఏమి అవుతుంది శవాలు మాయం అవ్వడం ఏంటని? తీవ్రమైన కోపంతో 2 వారాలలో ఇ కేసు ఒక కొలిక్కి రావాలి అని SI మనోహారికి కలెక్టర్ వార్నింగ్ ఇచ్చాడు.

కలెక్టర్ ఇచ్చిన వార్నింగ్ దృష్టిలో పెట్టుకొని SI మనోహర్ టీం రంగంలోకి దిగుతారు, మొదట్లో మాయమైన మహిళా శవం కుటుంబసభ్యులని విచారిస్తే, నల్ల త్రాచుపాము కాటుకి గురై చనిపోయింది, చికిత్స కోసమని పెద్ద ఆసుపత్రికి తీసుకోని వెళ్లిన కూడా ఉపయోగం లేకుండాపోయింది అని ఇలా విచారణ లో చెప్పారు. SI మనోహర్ పెద్ద ఆసుపత్రికి వచ్చి వైద్యులని విచారణ చేస్తే, మేము వీలయినంత వైద్యం అందచేసాము, చివరకి మహిళా ఆరోగ్య పరిస్థితి విషమించడంతో చనిపోయిందిని వైద్యులు చెప్పారు.

SI మనోహర్ కి ఏమి అర్ధము కావడములేదు, ఆసుపత్రిలోని ఆ రోజు సీసీటీవీ రికార్డింగ్‌ చూస్తే మహిళా కుటుంభసభ్యులుతోపాటు డాక్టర్ మరియు కంపౌండర్ కూడా ఉండటం చూసి SI మనోహర్ వాళ్ళ ఇద్దరిని విచారిస్తే, ఒక రోజు పాము కాటుకి గురై వస్తే మేము ప్రధమ చికిత్స చేసాము, తరువాతకి పెద్ద ఆసుపత్రికి తీసుకొనివెళ్ళాము అని డాక్టర్,కంపౌండర్ కూడా అదే చెప్పేసరికి SI మనోహర్ కి  ఒక క్లూ కూడా లేదు, అసలు ఎక్కడనుండి విచారణ మొదలు పెట్టాలనో అర్ధము కావడము లేదు, తల బ్రద్దలు అయిపోతుంది అనుకుంటాడు.

అప్పటికి 3 రోజులు గడిచాయి, కేసులో పురోగతి లేదు ఎవరి మీద సందేహం లేదు అని ఆలోచిస్తున్నాడు SI మనోహర్. ఇక మొదటి కేసు పక్కన పెట్టి ముసలి అవ్వ మనువరాలి శవం మాయం అయినా కేసుని విచారణ చేయాలిఅనుకున్నాడు.

మొదట ముసలి అవ్వ దగ్గరకి వెళ్లి విచారణ చేయగా, నా కొడుకు బిడ్డ అది, దాని తల్లితండ్రులు చిన్నప్పుడే చనిపోయారు, దానికి మూర్ఛవ్యాధి ఉండటం వాళ్ళ నేను బయటకి కూడా పంపియకుండా ఇంట్లోనే గారాబంగా పెంచుకున్న, ఒక రోజు ఉన్నట్టుండి అకస్మాత్తుగా ఎప్పుడు లేని అంత తీవ్రమైన మూర్ఛ వచ్చింది,ఆలస్యం చేయకుండా మన ఊరులో ఉన్న క్లినిక్ కి తీసుకెళ్ళినాము. డాక్టర్ సమయానికి లేకపోవడంతో కంపౌండర్ చూసి మందులు ఇచ్చిండు, మూర్ఛ తక్కువ అయ్యాక క్లినిక్ నుండి ఇంటికి వచ్చాము, మరుసటి రోజు పొద్దునే ఎంత లేపిన  లేవడం లేదు భయపడి డాక్టర్ దగ్గరకి తీసుకొనివెళ్తే ఆయన చూసి చనిపోయిందని  చెప్పాడని ఇలా వివరముగా SI మనోహర్ కి ముసలి అవ్వ  వివరిస్తాది.

మాయమవుతున్న శవాలకి, ఇ క్లినిక్ కి ఏదో లింక్ ఉందని SI మనోహర్ ఒక లీడ్ దొరకపట్టుకొని క్లినిక్ కి వెళ్తాడు. క్లినిక్ లో డాక్టర్ ఒక్కడే ఉంటాడు. ముసలి అవ్వ మనువరాలి కి ఒక కంపౌండర్ చికిత్స ఎలా చేస్తాడు? ఎలా మందులు ఇస్తాడు? అని డాక్టరుని SI అడుగుతాడు దానికి డాక్టర్ “నేను ఆ రోజు ఒక ముఖ్యమైన కేసు వస్తే వాళ్ళని తీసుకోని పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్లిన, ఆసుపత్రికి వెళ్లేముందు కంపౌండర్ కి క్లినిక్ ని చూసుకోమని చెప్పి వెళ్లిన” అని డాక్టర్ చేప్తాడు. కంపౌండర్ ఎక్కడ అని అడుగుతే, అతను ఇ రోజు సెలవు పెట్టాడని, ఇ మధ్య  వాడికి సోకులు ఎక్కువయ్యని కొత్త ఫోన్,బంగారపు చైన్ కూడా కొనుక్కున్నాడు అని  డాక్టర్ SI కి చేప్తాడు. SI మనోహర్ కి కంపౌండర్ పైన  ఇంకా గట్టిగ సందేహము ఏర్పడుతది..

సీసీటీవీ ఫుటేజ్:

మరుసటి రోజు పెద్ద ఆసుపత్రి నుండి SI కి ఒక ఫోన్ వస్తుంది. సర్..మీరు విచారణ చేస్తున్న కేసు లో కంపౌండర్ ఆ రోజు అర్ధరాత్రి పక్కనే ఉన్న మెడికల్ కాలేజీ కి వెళ్లినట్లు సీసీటీవీ లో ఉంది సర్… అని ఒక డాక్టర్ ఫోను చేసి  SI కి చేప్తాడు. ఆలస్యం చేయకుండా SI వెళ్లి అక్కడ ఉన్న సీసీటీవీ పరిశీలిస్తాడు, ఇ సీసీ ఫుటేజ్ నీకు ఎలా దొరికింది అని SI డాక్టర్ ని  అడుగుగా  “ఏదో కేసు మీద అదే రోజు మెడికల్ కాలేజీలో జరిగిన విషయాలు గురించి తెలుసుకోవడానికి ACP సర్ వచ్చి సీసీటీవీ ఫుటేజ్ చూస్తుంటే కంపౌండర్ ఇ ఫుటేజ్ లో ఉండటం చూసి మీకు ఫోన్ చేసానని  డాక్టర్ చేప్తాడు.

పక్కనే ఉన్న మెడికల్ కాలేజీ కి వెళ్లి ACP సర్ ని SI మనోహర్ కలిసి ఇలా జరిగింది అంత చెప్పి, మెడికల్ కాలేజీ లో ఏమైంది సర్ సీసీటీవీ ఫుటేజ్ కోసమని వచ్చారు అంటకదా, మీ కేసు ఏంటి సర్ అని అడిగిండు,” మెడికల్ కాలేజీ లో మానవ అవయవాల అక్రమ రవాణా చేస్తున్నారని,దీని వెనకాల పెద్ద మాఫియా ఉందని తెలుసుకున్నాము, మెడికల్ కాలేజీ డీన్ కి మాఫియా కి లింక్ ఉందని మా మొదటి విచారణలో తేలింది” అని SI మనోహర్ కి ACP సర్ చేప్తాడు. మానవ అవయవాల అక్రమ రవాణా గురించి తెలుసుకున్న SI ఏ మాత్రం ఆలస్యం చేయకుండా SI మనోహర్ &అతని టీం కంపౌండర్ కోసమని వెతుకుతారు. ఊళ్ళో వాళ్ళని, కంపౌండర్ తల్లితండ్రుల్ని అడుగుతే ఎక్కడ కూడా కనపడలేదు అని సమాధానం ఇచ్చారు, చివరకి కంపౌండర్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా ఎట్టకేలకు  కంపౌండర్ ని పట్టుకున్నారు.

అసలు నిజం:

SI మనోహర్ కంపౌండర్ విచారణ చేసాకా కంగు తిన్నాడు, మరుసటి రోజు మీడియా ముందుకు వచ్చి ” ఒక మారుమూల గ్రామము లో  సంతోష్ అనే ఒక కరుడుగట్టిన నేరస్థుడు క్లినిక్ లో కంపౌండర్ గా పనిచేస్తున్నాడు, డబ్బు పైన అత్యశా, విలాసమైన జీవితం గడపాలినుకొనేవాడు.

detective stories in telugu
detective stories in telugu

ఒక రోజున నల్ల త్రాచుపాముకి కాటు గురైన మహిళని పెద్ద ఆసుపత్రికి తీసుకోని వచ్చారు, అదే రోజు రాత్రంతా  మహిళా కుటుంభసభ్యులతో పాటు కంపౌండర్ కూడా ఉన్నాడు కానీ కంపౌండర్ సమయం పొద్దుపోక ఏవో ఆలోచనలు వాళ్ళ నిద్ర పట్టక పక్కనే ఉన్న మెడికల్ కాలేజీ చూసాడు. అర్ధరాత్రి అవ్వడంవల్ల గేట్ దగ్గరున్న సెక్యూరిటీ నిద్ర పోయాడు, ఇదే మంచి సమయం అనుకోని కంపౌండర్ మెడికల్ కాలేజీ లోపాలకి వెళ్ళాడు.  లోపాలకి వెళ్లి చూస్తే ఒక గది లో ఎవరో చర్చించుకుంటున్నారు, ఇంకాస్తా దగ్గరకి వెళ్లి వాళ్ళు మాట్లాడేవి అన్ని విన్నాడు. మరుసటి రోజు కంపౌండర్ సరాసరి మెడికల్ డీన్ దగ్గరకి వెళ్లి మీరు రాత్రి మాట్లాడుకున్నవి అన్ని నేను విన్నాను కానీ మీరు ఏమి  భయపడకండి నేను ఎవరికి చెప్పకుండా ఉండాలంటే నన్ను కూడా మీ దందాలో చేర్పించుకోండి, మీకు చాల సహాయం చేస్థానునని ఇలా చెప్పేసరికి మెడికల్ కాలేజీ డీన్ కూడా సరేనని డీల్ కుదుర్చుకున్నారు.

డీల్ కుదుర్చుకొని ఆసుపత్రి కి వచ్చేసరికి పాముకాటుకు గురైన మహిళా చనిపోయింది అని చెప్పారు. అప్పుడే ఆ సమయంలోనే కంపౌండర్ కి డీల్ గుర్తొచ్చింది, ఆ మహిళా శవాన్ని మాయం చేసి ఆమె అవయవాలు అమ్మకానికి పెడుదామని అనుకున్నాడు కానీ ఇప్పుడు సాధ్యం అయ్యేలా లేదునుకొని ఊరు కి వచ్చారు, పూడ్చిపెట్టిన తరువాతైనా మాయం చేయాలనీ కూర్చున్నాడు, అతను అనుకున్నట్లే ఏ సమస్య రాకుండా ఒక అర్ధరాతి పుడిచిపెట్టిన మహిళా శవాన్ని పైకి తీసి, తీసుకోని వెళ్లి మాఫియాకి అమ్మేశాడు.

ఇలానే ఆ ముసలి అవ్వ మనువరాలు మూర్ఛవ్యాధి తో క్లినిక్ కి వస్తే స్లో పాయిజన్ ఇంజక్షన్ ఇచ్చి చనిపోయేలా కుట్ర పన్నాడు.  ముసలి అవ్వ మనువరాలని కూడా పూడ్చిపెట్టిన గోతి నుండి వెలిక తీసి మాఫియాకి అమ్మేశాడు, ఇలా వచ్చిన డబ్బులతో బంగారం,జల్సా చేసేవాడు అని స్పష్టముగా,పూస గుచ్చినట్లుగా SI మనోహర్ మీడియా కి చెప్పాడు. నింతుడుకి కఠిన కారాగార శిక్ష వేశారు…

detective stories in telugu
detective stories in telugu

 

 

ఇలా మరిన్ని detective stories in telugu  page ని like కొట్టండి share చేయండి…

 

 

 

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *