Real Incidents in Village:
అప్పట్లో నల్లగొండ జిల్లా కేంద్రంలో అన్నారిగూడెం అనే ఒక గ్రామం ఉంది, తరువాత పలు జిల్లాలు చేసాక ప్రస్తుతం సూర్యాపేట జిల్లా కిందికి చేర్చారు. అన్నారిగూడెం మా అమ్మమ్మగారి ఊరు, మేము పాఠశాల చదువుకొనే రోజుల్లో ఎండాకాలం సెలవలు ఇస్తే మా అమ్మమ్మగారి ఇంటికే సక్కగా వెళ్లిపోయేవాళ్ళం.
2003 సవంత్సరం లో 4th class అయిపోయింది, ఎండాకాలం సెలవలు ఇచ్చారు, ఇక మా కుటుంబమంతా అమ్మమ్మగారి ఇంటికి వెళ్లాలని అనుకున్నాము, మాకు అమ్మమ్మగారి ఊరు అయినా, ఇళ్లయినా చాలా సెంటిమెంట్, ఎక్కడ లేని శక్తి, ఆనందం వస్తాది, మాకే కాదు 90’s లో పుట్టిన ప్రతిఒక్కరికి తెలుస్తది.
ఇక అమ్మమ్మగారి ఇంటికి వెళదామని ముల్లె మూట సర్దుకొని తయారు అవుతున్నాం, ఇంతలో మా నాన్నవచ్చి “ఇప్పుడు వద్దులే, ఎండలకు తిరిగి నల్లనికట్టె అవుతారు ఇంకా ఎప్పడైనా వెళ్ళండి మీ అమ్మమ్మగారి ఇంటికి” అని అన్నాడు. మా నాన్న ఇలా అనడంతో నేను ఏడుస్తూ వెళ్ళి మట్టిలో బోర్లాడినా, కాసేపటికి మా బాధ, ఏడుపు చూసి తట్టుకోలేక సరే వెళ్ళండి కానీ ఎండలో తిరగకండి అని చెప్పడంతో మా ఆనందానికి హద్దులు లేవు, మమ్ముల్ని ఎవడ్రా ఆపేది అనుకుంటూ వెళ్లి ఆటో ఎక్కినము, ఆటోలో డ్రైవర్ సీట్ పక్కనే కూర్చోవడం అంటే చాల ఇష్టం, వెళ్లి డ్రైవర్ సీట్ పక్కనే కూర్చొని ఒక కాలు బయట పెట్టి ఒక చేతితో ఆటో రాడ్ పట్టుకొని ఇంకో చేతితో డ్రైవర్ అన్న సీట్ పట్టుకొని ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళాము.
మా అమ్మమ ఊరు చేరుకున్నాం, ఇంటికి వెళ్లేసరికి మా పెద్దమ్మవాళ్ల పిల్లలు కూడా ఉన్నారు. అందరము కలిసి అన్నం తిని కబుర్లు చెప్పుకున్నాం. అదే ఊరులో మా ఇద్దరు తాతయ్య వాళ్ళు కూడా ఉంటున్నారు. మా మామయ్యలు ఆరుగురు ఉండేవారు,మేము, మా పెద్దమ్మ వాళ్ళ పిల్లలు ఆరుగురు ఉండేవాళ్ళము అందరికి ఒకే వయసు ఉండటంవల్ల స్నేహితులు మాదిరి ఉండేవాళ్ళము. మొత్తం మూడు ఇల్లు ఉండటం వాళ్ళ పొద్దున లేచిన దగ్గరనుండి ఆ ఇంటికి ఇ ఇంటికి తిరుగుతూనేఉంటాం.
ఎండాకాలం కాబట్టి చెరువులో చేపలు పట్టేవాళ్లు, మేము కూడా వెళ్లి తల ఒక తెప్ప తీసుకోని చెరువు ఒడ్డులో చేపలు పట్టినట్లు చేసేవాళ్ళము, ఈత కొట్టేవాళ్ళము . చెరువు నుండి ఇంటికి వచ్చేసరికి మా అమ్మమ చేపల కూర చేసింది. అందరము ఇక్కడే తిన్నాము, సాయంత్రము అయ్యేసరికి సీసముగోళీల ఆట, పత్తలు, ఇలా చాల ఆటలు ఆడేవాళ్ళము.
ఒక తాతయ్య వాళ్ళ ఇల్లు ఊరుకి చివర్లో ఉంటది, ఒక రోజు అందరమూ అక్కడే పాడుకోవాలి అని అనుకున్నాము, అనుకున్నట్లగానే అందరము అక్కడే తినేసి పాడుకున్నాము. ఊరుకి చివరలో ఉండటం వాళ్ళ నాకు అంత సరిగా నిద్ర పట్టలేదు, ఏదో తెలియని భయం ఉండేది. మా తాతయ్య వాళ్ళు ఇంకా నిద్రపోలేదు ఏదో మాట్లాడుకుంటున్నారు. సమయము చాల గడిచింది, ఇంతలో ఎవరో ఒక గుంపు కర్రలు పట్టుకొని వచ్చారు, మా తాతయ్య వెళ్లి ఏదో మాట్లాడుకున్నాక వాళ్ళు వెళ్లిపోయారు. నాకు ఎలాగోలా నిద్ర పట్టేసింది. రాత్రి ఎవరు వచ్చింది? ఎందుకు ఆ సమయంలో కర్రలు పట్టుకొని వచ్చారు? ఎం మాట్లాడుకున్నారు? ఇవి అన్ని నేను తెలుసుకోవాలి అనుకున్నా.
మేము అందరము వెళ్లి మా అమ్మమని అడిగినాము, ఆమె మాకు అసలు చెప్పలేదు మీకు తెలియాల్సిన అవసరము లేదు వెళ్ళండి అని చెప్పేసింది, ఇలా కాదులే అని మా తాతయ్యని అడుగుతే ” ఊరు లో చేతబడి చేస్తున్నారు ప్రతి వీధిలో ఒక గుంత తొవ్వి అందులో చిన్న కోడిపిల్లని, నిమ్మకాయ,పసుపు,కుంకుమ వేసి పూడుస్తున్నారు అని చెప్పారు”, అప్పుడు సమయం మిట్టమధ్యానము అయింది, ఊరులో ఎవరు లేరు అంత పనికి వెళ్లారు, ఎండలు ఎక్కువ ఉండటంవల్ల ఏ వీధి చుసిన కూడా ఎవరు లేరు. అంత మాకు భయం భయంగా ఉంది. ఇలా 3,4 రోజులు గడిచాయి మా ఆటలు తక్కువ అయినాయి. ఒక రోజు రాత్రి 7 గంటల సమయంలోనే అందరూ గుంపు గుంపుల వచ్చి అరుస్తున్నారు. చేతబడి చేసాడు అనే నెపంతో ఒక అతని పట్టుకొని కొడుతున్నారు,ఎవరో పోలీస్ వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి అతని తీసుకోని వెళ్లిపోయారు.
ఆ మరుసటి రోజు మాకు అంత భయంగా ఉంది,చీకటి పడితే ఇంట్లోనే ఉండేవాళ్ళము తెలియని రోజులు అవి,మా మనసులో ఇంకా చేదు జ్ఞాపకాలులనే మిగిలిపోయినవి.
category: Real Incidents in Village