నేను రెసిడెన్షియల్ పాఠశాలలో చదువుకొనే రోజులలో నాకు జరిగిన ఒక సంఘటన. ఇ విద్యాలయం సుమారుగా 35-40 ఎకరాలలో ఉన్నది. ఇది 1980 లో స్థాపించబడినది, 6th class to inter 2nd year వరకు చదువుకొనే వెసులుబాటు కల్పించారు.1980 సవంత్సరంలో కట్టబడిన పాఠశాల,హాస్టల్ భవనాలు ఇప్పటికి ఉన్నాయి కానీ ఇప్పుడు ఎవరు ఉపయోగించడం లేదు, ఎందుకంటే 2000 సవంత్సరంలో కొత్త పాఠశాల భవనాలు, కొత్త హాస్టల్స్ కట్టి అందులోనే ఉంటున్నారు విద్యార్థులు. మొదట్లో కట్టినా భవనాలు శిథిలావస్థకు వచ్చినవి మరియు దట్టమైన చెట్లు, విష సర్పాలుతో నిండి ఉన్నవి మొదట్లో కట్టిన భవనాలు అంతా ఒక వైపు ఉండేవి, కొత్తగా కట్టినా భవనాలు అంతా ఇంకో వైపు ఉండేవి, వీటికి మధ్యలో దరిదాపుగా 1.5km దూరం ఉండేవి.

కరెంటు సమస్య:
సాధారణముగా ఎపుడో ఒక రోజు రాత్రులు కరెంటు సమస్య ఉండేది, ఒక రోజు అందరము 7pm tuition అయిపోయాక డిన్నర్ కి వెళ్ళాము సరదాగా డిన్నర్ చేశాము, డిన్నర్ చేశాక next హాస్టల్ కి వెళ్లి పడుకోవాలి కానీ ఒక రోజు హాస్టల్ కి వెళ్ళాకా 9pm సమయంలో కరెంటు పోయింది, ఇలానే ఏదో ఒక రోజు కరెంటు సమస్య ఉండేది. కరెంటు పోయిన సమయంలో హాస్టల్ లో బాగా ఉక్కపోతగా ఉంటుంది అని చాలా మంది హాస్టల్ నుండి గ్రౌండ్ కి వచ్చి కబుర్లు, Best Horror Stories చెప్పుకొనేవాళ్ళము. నేను, ఇంకో ముగ్గురు స్నేహితులు గ్రౌండ్ లో కూర్చొని దెయ్యాల స్టోరీస్ చెప్పుకుంటున్నాము.
మూగవాడు:
నా దోస్తు ఒకడు వాళ్ళ ఊరు లో జరిగిన సంఘటన గురించి చెప్పసాగాడు ఏంటి అంటే, వాళ్ళ ఊరు లో ఒక మూగవాడు ఉండేవాడు, అతనికి నిద్రలో నడిచే అలవాటు ఉంది అంతే కాకుండా ఏదో దెయ్యం పట్టినట్లు కూడా చేసేవాడు, మంత్రసాని దగ్గరకి తీసుకెళ్ళిన కూడా ఏ ఉపయోగం లేదుఅన్నారు. అతనికి నిద్రలో నడిచే అలవాటుతో ఒక రోజు రాత్రి నిద్రలో నుండి లేచి ఇంట్లో నుండి బయటకి వచ్చి శ్మశానవాటిక వైపు వెళ్లడం మొదలుపెట్టాడు, కానీ దారి మధ్యలో ఒక పాడుబడ్డ భావి ఉంది, ఇతను నిద్రలోనే నడుచుకుంటూ వెళ్లి ఆ పాడుబడ్డ భావి లో పడి దురదృష్టవశాత్తు చనిపోయాడు అని ఇలా నా స్నేహితాడు చెప్పాడు. ఆ విషయం విన్నా మేము భయపడినాము, నాకు చాలా ప్రశ్నలు, సందేహాలు ఉన్నాయ్ అవి ఏంటి అంటే,
1. ఆ మూగ వాడు శ్మశానవాటిక వైపు ఎందుకు వెళ్ళాడు?
2. ఆ మూగవాడికి దెయ్యం పట్టినట్లు చేస్తే ఆ మంత్రసాని కూడా నా వాళ్ళ కాదు అని ఎందుకు అన్నారు?
3. అతను అర్ధరాత్రి నిద్రలో నడిచి బయటకి వస్తుంటే అతని కుటుంబ సభ్యులు ఎం చేసారు?
4. అతను చనిపోయిన మరుసటి రోజు, ఇలా శ్మశానవాటిక వైపు వెళ్తుంటే భావి లో పడి చనిపోయాడు అని కళ్ళకి కట్టినట్లుగా జనాలకి,కుటుంబసభ్యులకి ఎవరు చెప్పారు?
5. శవం పాడుబడ్డ బావిలోనే కచ్చితంగా ఉంది అని ఎవరు చెప్పారు?
ఇలా చాలా సందేహాలు చర్చించుకునే సమయం లోనే కరెంటు వచ్చింది, ఆ ప్రశ్నలు, సందేహాలు అన్ని కూడా గ్రౌండ్ లోనే వదిలేసి హాస్టల్ కి వచ్చాము. కాసేపు అయ్యాక మా హౌస్ మాస్టర్ వచ్చి attendance తీసుకున్నారు, వెళ్లిపోయారు. ఇక మేము అంతా ఎవరి బెడ్ మీద వాళ్ళు పడుకున్నాం, కిటికీ నుండి వస్తున్నా చల్ల గాలికి తొందరగానే నిద్ర పట్టింది.
ఉదయం వ్యాయామం:
ఉదయం 5am కి watchman వచ్చి అందరిని నిద్ర నుండి లేపాడు, so అందరం లేచి వ్యాయామంకి వెళ్ళాలి . కాలకృత్యాలు తీర్చుకొని,రెడీ అవుతున్న సమయంలో ఆ స్టోరీ చెప్పిన స్నేహితుడు బెడ్ పైన కనిపించలేదు. ఎక్కడికి వెళ్ళాడు, ఏమైంది అని బాత్రూం లో, హాస్టల్స్ మొత్తం వెతికాం ఎక్కడా కూడా కన్పించలేదు almost 1hr అవుతుంది,మాకు చాల కంగారుగా ఉన్నాము, ఇక Principal or House Master కి కంప్లైంట్ చేయాలి అని చూస్తున్న సమయంలో మా స్నేహితుడు అప్పట్లో కట్టినా భవనాలు, దట్టమైన చెట్ల ఉన్న వైపు నుండి వస్తున్నాడు, మేము అంతా వాడిని చూసి షాక్ అయ్యాం, వాడిని దగ్గరకి తీసుకోని “అరేయ్ ఏమయిందిరా ఇక్కడినుండి వస్తున్నావ్, ఇటు ఎందుకు వచ్చావు” అని ప్రశ్నలు మీద ప్రశ్నలు వేసి ఒత్తిడి గురిచేస్తున్నాం.
మా ఒత్తిడి తట్టుకోలేక వాడు ఎం చెప్పాడో తెలుసా, నాకు నిద్రలో నడిచే అలవాటు ఉంది, ఆ చనిపోయిన మూగవాడు ఎవరో కాదు మా నాన్న ఏ అని మాకు షాక్ ఇచ్చాడు, వంశపారంపర్యంగా నిద్రలో నడిచే వ్యాధి నాకు వచింది అని మెళ్ళగా చెప్పాడు, మాకు ఎం చేయాలనో కూడా ఎం అర్ధం కాలేదు. సరే అని అంతా set అయ్యాక మాట్లాడుకుందమని వాడిని హాస్టలోకి తీసుకోని వెళ్ళాము.
పాడుబడ్డా భవనాలు,దట్టమైన చెట్లు:
హాస్టల్ కి వెళ్లాక అసలు ఏమయిందిరా ఎప్పుడు వెళ్ళావు ఎలా వెళ్ళావు అని అడుగుతే, నాకు కూడా తెలవదు కదరా, నిద్రలో నడిచే అలవాటు ఉన్నవాళ్ళకి ఎప్పడు ఏ సమయంలో ఎటు వెలుతారో తెలవదు కానీ నాకు తెల్లవారుజామునే మేల్కోవా వచ్చింది, సమయం 3am అవ్వొచ్చు. కొంచం ముందుకు వెళ్లి చూసా అంతా పాడుబడ్డా భవనాలు,దట్టమైన చెట్లు చాలా భయంకరంగా ఉన్నాయి, అవి దాటుకొని ముందుకు వెళ్తే అక్కడ ఉన్న మర్రి చెట్టు కింద ఎవరో ఏడుస్తూ ఉన్నారు, ఇంకా దాని దగ్గరకి వెళ్లి చూస్తే అక్కడ ఒక చిన్న మేక కట్టేసి ఉంది అది అచ్చం మనిషిలానే ఏడుస్తుంది, దాని చుట్టూ 4 గుడ్లగూబలు ఉన్నాయి, ఆటు వైపు నుండి ఎవరో వస్తున్నట్లు చాలా భయం భయంగా వస్తున్నారు, నాకు చాలా స్పష్టంగా వినపడ్డది ఎవరో ఏడుస్తున్నారు చాలా వింత శబ్దముతో, ఒక తెలియని ఆకారము నల్లగా నా మీదకి వచ్చినట్లు ఉంది, గోడల మీద ఏదో తెలియని పిచ్చి రాతలు ఉన్నవి, ఆ మర్రి చెట్టు ఊడలకి తెల్లటి వెంట్రుకలు వేలాడి తీసిఉన్నాయి, ఇవి అన్ని చూసి నాకు భయంవేసి ఎటు వెళ్ళాలనో తెలియక పరుగెత్తినా.
నాకు దారి తెలుసుకొని వచ్చేసరికి చాలా సమయం పట్టింది అని చెప్పాడు, ఇది విన్నా మేము చాలా కంగారు పడ్డాం, అసలు వీడు చెప్పినవి అన్ని నిజమేనా లేదంటే వీడు ఏమైనా భ్రమ పడ్డాడా! అని చాలా ఆలోచించము. మా అమ్మనాన్నలకి, ఉపాధ్యాయాలుకి చెప్పాలనుకున్నాం, కానీ మేము 7th class చదువుతున్నాం మేము ఇలా జరిగింది అని చెప్పుతే ఎవరు నమ్మరు పైగా మమ్ములని ఏమైనా అంటారు ఏమో అని ఎవరికి చెప్పకుండా దాచుకున్నాం.
హోలీ మంట:
4 సవంత్సరాలు అయిపోయినాయి మేము పెద్దోళ్ళాం అయ్యాము, ఇంటర్ 1st year కి వచ్చాము. ఇంకో 2 రోజుల్లో హోలీ పండగ. విద్యాలయం లో ఒక event కండక్ట్ చేస్తారు అది ఏంటి అంటే హోలీ రోజు పెద్ద మంట వెయ్యాలి, ఆ హోలీ మంట దగ్గరకి అందరూ వచ్చి సరదాగా గడుపుతారు. హోలీ మంట కి పెద్ద కట్టెలు కావాలి, ప్రతి సవంత్సరం inter 1st year విద్యార్థులు పెద్ద పెద్ద కట్టెలు తెచ్చి హోలీ మంట కి పేరుస్తారు. so ఇ సవంత్సరం మా batch కి ఛాన్స్ వచ్చింది, కట్టెలు తీసుకొనిరావాలి అంటే పాడుబడ్డ భవనాలు దాటుకొని, అడవిలోకి వెళ్ళాలి.
మర్రి చెట్టు:

4 సవంత్సరాలు క్రితం వదిలేసిన భయంకరమైన విషయాలు మళ్ళీ గుర్తు తెచ్చుకొని, నా స్నేహితుడికి జరిగినా సంఘటన ఇంకా ఎవరకి జరగొద్దు అని fix అయ్యాము. మా batch బాయ్స్ అంతా కట్ట కలిసి ఆ పాడుబడ్డా భవనాలు ఉన్న చోటు కి వెళ్ళాము. అంతా బానే ఉంది ఇంకా కొంచెము ముందుకి వెళ్లి చూస్తే అక్కడ నా స్నేహితుడు చెప్పినట్లే ఒక మర్రి చెట్టు ఉంది, ఆ మర్రి చెట్టు కింద ఏవో పూజలు చేసి ఉన్నాయ్, అంతా రక్తపు మరకాలు, మర్రి ఊడలకి ఏవో వేలాడితీసి ఉన్నాయి.
క్షుద్ర పూజలు:
అక్కడ ఉన్నగోడలపైన విచిత్రమైన రాతలు, బొమ్మలు వేసి ఉన్నాయి. అవి అన్ని చూస్తుంటే భయం భయంగా ఉంది, నాతో పాటు వచ్చిన నా స్నేహితులు అంతా భయపడుతున్నారు, ఏదిఏమైనా అనుకోని ఆ మర్రి చెట్టు ని దాటుకొని ముందుకి వెళ్లి చూస్తే అక్కడ ఒక చిన్న దారి ఉంది, ఆ దారిని పట్టుకొని అందరం ముందుకు వెళ్లసాగినామ్, ఆ దారి ముగింపు కి వచ్చింది ముందు చూస్తే కొంచము దూరం లో ఒక చిన్న ఊరు ఉంది. మాకు ఎం అర్ధం కాలేదు, చాలాసేపు ప్రశ్నలు మీద ప్రశ్నలు వేసుకున్నాము, మా ప్రశ్నలకి సమాధానం ఎవరు ఇస్తారు, మా ప్రశ్నలు ఇంతే మిగిలిపోతాయా అని భోగి మంట కి కావాల్సిన కట్టెలు అయితే తెచ్చాము. ఆ event పూర్తి అయ్యాక ధైర్యం చేసి మా అమ్మనాన్నలకి, ఉపాధ్యాయాలుకి చెప్పాము.
మరుసటి రోజున పోలీస్ వాళ్ళు వచ్చి విచారణ చేస్తున్నారు, మా దగ్గరకి వచ్చి అడిగిన ప్రశ్నలన్నిటికీ మేము సమాధానం ఇచ్చాము, ఒక పోలీస్ టీం పాడుబడ్డా భవనాలు ఉండే స్థలానికి వెళ్లారు, ఇంకో టీం ఆ చిన్న ఊరుకి వెళ్లి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. కొన్ని రోజుల తరువాత ఇ కేసు ఒక కొలిక్కి వచ్చింది. ఇ కేసు లో involve అయినా వాళ్ళు అంతా జైలు పాలుఅయ్యారు.
చేతబడి:

అసలు ఏమైంది, ఎం జరిగింది అని ఇప్పటికి మాకు తెలవదు, వెళ్ళి మా ప్రిన్సిపాల్ ని అడుగుతే అంతా స్పష్టంగా వివరించాడు. ” ఆ ఊరులో మూఢనమ్మకాలు ఎక్కువ, ప్రతి అమావాస్య నాడు ఆ మర్రి చెట్టు దగ్గరకి వచ్చి చేతబడి(Black Magic ), క్షుద్ర పూజలు నిర్వహించేవారు, ఎప్పుడు అయితే ఆ భవనాలు అన్ని శిధిలావస్తు కి వచ్చాయో చేతబడి చేసేవాళ్ళకి ఒక మంచి చేతబడి అడ్డా అయిపోయింది, దానికి తోడు మర్రి చెట్టు, దాని ఊడలు కూడా చాల భయంకరంగా ఉండటంవల్ల క్షుద్ర పూజలు చేసేవాళ్ళకి కలసి వచ్చింది, చేతబడి అనేది విధివిధాలుగా చేస్తారు అవి అన్ని మీకు తెలియాల్సిన అవసరం లేదు వెళ్లి సంతోషంగా చదువుకోండి అని చెప్పారు. మేము అంత ఉపిరి పిలుచుకున్నాం, ఆ మరుసటి రోజు మా విద్యాలయంలోని ఉపాధ్యాయులు పక్కనే ఉన్న గ్రామానికి వెళ్లి చేతబడి, మూఢనమ్మకాలు గురించి ప్రజా అవగాహన చేసారు.
రోజులు గడిచాయి inter 2nd year పూర్తి అవ్వడంతో విద్యలయంలో మా చదువులు పూర్తి అయిపొయినవి, తదుపరి ఉన్నత చదువులకోసం అని బయటకి వచ్చాము కానీ నా స్నేహితుడు వాళ్ళ నాన్నగారు ఎలా చనిపోయారు, ఆ అర్ధరాత్రి ఎం జరిగింది ఇలా ఎన్నో ప్రశ్నలు,సందేహాలు నన్ను ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి…..
ఇలా Best Horror Stories in Telugu లో కావాలి అంటే follow చేయండి
Good